రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

విశ్వంభర, హైదరాబాదు : రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ పబ్లిక్, ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాదు ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో నిర్వహించిన ధర్నాలో మాట్లాడారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12,000 ఆర్థిక సహాయం, ఆదాయం తగ్గిన వారికి నెలకు రూ.4,500 జీవనభృతి ఇవ్వాలని కోరారు. ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యాప్ సంస్థల అధిక కమిషన్లు, జరిమానాలు, భద్రతా లోపాలు సమస్యలను తీవ్రతరం చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, వృద్ధాప్య పింఛన్ వంటి సదుపాయాల కోసం సంక్షేమ బోర్డు అవసరమని చెప్పారు. డిమాండ్లు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎల్.కోటయ్య అధ్యక్షతన కె.సతిష్, వెంకటేశ్వర్లు, క్రీష్ణ, ముఖేష్, రవి, ప్రేమాజి, రాములు, లావణ్య, అసిఫ్ పాల్గొన్నారు.

Tags: