వీధి వ్యాపారుల చట్టం దేశవ్యాప్తంగా అమలు చేయాలి

వీధి వ్యాపారుల చట్టం దేశవ్యాప్తంగా అమలు చేయాలి

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: వీధి వ్యాపారుల చట్టాన్ని దేశవ్యాప్తంగా సమర్థంగా అమలు చేయాలని తెలంగాణ స్ట్రీట్ హాకర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సి హెచ్ సతీష్ గౌడ్ అన్నారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. వివిధ రాష్ట్రాల్లో వీధి వ్యాపారుల అక్రమ తొలగింపులు, చట్ట అమలులో లోపాలపై చర్చించి, సంక్షేమం కోసం జాతీయ స్థాయి పోరాటానికి రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో రాజేష్ గురునాని (బీహార్), మహేశ్వర్ బాల్, ప్రీతమ్ సింగ్ (ఒడిశా), అన్వర్ షీరీట్ (కర్ణాటక) , దయ్యాల శ్రీనివాస్, లుధియా, రమేష్ కుమార్, కుమార్, రఫీక్, విశాల్ సింగ్, భూదేవి, అంజలి తదితరులు పాల్గొన్నారు.

Tags: