డా. పద్మకు లయన్స్ ఉగాది పురస్కారం

డా. పద్మకు లయన్స్ ఉగాది పురస్కారం

విశ్వంభర, సికింద్రాబాదు : మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ సమాజానికి సేవలందిస్తున్న సైకో థెరపిస్ట్ డా. హిప్నో పద్మా కమలాకర్‌కు "లయన్స్ ఉగాది జాతీయస్థాయి పురస్కారం–2026" ప్రదానం చేశారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320ఏ  ఆధ్వర్యంలో సికింద్రాబాదులో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ గవర్నర్ డా. మహేంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సేవలతో పాటు సంస్కృతి, సాహిత్య పరిరక్షణకు కూడా ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని అన్నారు.విద్యార్థుల ఒత్తిడి నివారణ, కుటుంబాల్లో భావోద్వేగ సమతుల్యత, దాంపత్య సంబంధాల్లో అవగాహన పెంపుపై చేస్తున్న సేవలు ప్రశంసనీయం అని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టి. నైనా దేవి, డా. సూర్యనారాయణ, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.

Tags: