తార్నాకలో చలివేంద్రం ప్రారంభం
On
విశ్వంభర, తార్నాక : వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తార్నాకలో ప్రఫుల్ల మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం, మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ లక్కరాజు నిర్మల, కొండపల్లి నరసింహరావును అభినందించారు. కార్యక్రమంలో మోతే శోభన్ రెడ్డి, సులోచన, రమాలత, ఆత్మీయ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.



