యువత అతివేగాన్ని మానుకోవాలి: డీజీపీ

విశ్వంభర, హైదరాబాదు : యువత వాహనాలను వేగంగా నడిపే అలవాటును మానుకోవాలని  డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. నగరంలోని అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్‌లో సోమవారం ‘యుఫోరియా–2026’ వేడుకలను ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల్లో యువత ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. కృత్రిమ మేధస్సు ప్రాధాన్యత, ఇంజనీర్ల పాత్ర, ఫార్మసీ రంగం అవసరంపై పలువురు వక్తలు వివరించారు. కార్యక్రమంలో శ్రీనివాస రావు, నందీష్, డాక్టర్ ఎం. ప్రియాంక, శ్రవణ్ కుమార్, డాక్టర్ ఆర్. శ్రీదేవి, అభిషేక్ దీయిజోడే, ప్రొఫెసర్ టీ.వీ. నారాయణ, జయప్రద, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: