ప్రైవేట్ ఇన్సూరెన్స్‌కు స్కీములు ఇవ్వొద్దు: ఏఐటీయూసీ

విశ్వంభర, హిమాయత్ నగర్  : భవన నిర్మాణ సంక్షేమ బోర్డు స్కీములను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించే జీవో నెం.12ను సవరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాల రాజు డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాదు హిమాయత్ నగర్ లోని ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. సంక్షేమ పథకాలను బోర్డు ద్వారానే అమలు చేయాలని, సహజ మరణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని, సిఎస్‌సి హెల్త్ టెస్టులను రద్దు చేయాలని కోరారు. కార్మికుల నిధులను ప్రైవేట్ కంపెనీలకు మళ్లించడం అన్యాయమని విమర్శించారు. పెండింగ్ పరిహారాలు వెంటనే చెల్లించి, హెల్త్ కార్డులు జారీ చేయాలని సూచించారు. సమావేశంలో ఎం ప్రవీణ్ కుమార్, ఏం నరసింహ, పల్లా దేవేందర్ రెడ్డి, ఎండి ఇమ్రాన్, గన్నార రమేష్, కమతం యాదగిరి, ఎస్ మల్లేష్, జీ పరమేష్, పి సమ్మయ్య, కే నరసింహారెడ్డి, వి మల్లికార్జున్, కే వెంకటేష్, శివశంకర్ పాల్గొన్నారు.

Tags: