అన్నపూర్ణ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం
విశ్వంభర, బోడుప్పల్: బోడుప్పల్లోని అన్నపూర్ణ కాలనీలో కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, డిసిసి అధ్యక్షులు వజ్రష్ యాదవ్, టిఆర్ఎస్ మాజీ మేయర్ సామల బుచ్చిరెడ్డి, కాంగ్రెస్ మాజీ మేయర్ అజయ్ యాదవ్, టిఆర్ఎస్ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి కాంగ్రెస్ అధ్యక్షులు పోగుల నర్సింహారెడ్డి, మాజీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులు పాల్గొని హాల్ ను ప్రారంభించారు.అత్యాధునిక పద్ధతులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. హాల్ నిర్మించడానికి కృషి చేసిన అన్నపూర్ణ కాలనీ అధ్యక్షులు ప్రభాకర్ గుప్తా,సెక్రటరీ రామకృష్ణ, కమిటీ సభ్యులను భవన నిర్మానానికి సహకరించిన దాతలను ముఖ్య అతిథులు, నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కాలనీవాసులు, కమిటీ సభ్యులు,మహిళలు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



