ఇనుగాల వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నూతన కమిటీల ఎన్నిక
విశ్వంభర, హనుమకొండ :-DCC అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఐనవోలు మండల నూతన కమిటీల ఎంపికపై అబ్సర్వర్లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందిహనుమకొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యం - ఐనవోలు మండల నూతన కమిటీల ఎంపికపై కసరత్తుతెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ఆదేశాల మేరకు, హనుమకొండ జిల్లా వ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేసేందుకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియలో భాగంగా పాత కమిటీలను రద్దు చేసి, పారదర్శకంగా నూతన కమిటీలను ఎన్నుకునేందుకు నియమించబడిన అబ్సర్వర్లు కుందూర్ వెంకట్ రెడ్డి, పింగిలి వెంకట్ రెడ్డి, బిల్లా ఉదయ్ రెడ్డి, మదన్ గౌడ్, పి. సారంగపాణి ల తో కలిసి ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గం, ఐనవోలు మండల నాయకులతో మ్యాంగో ఫార్మ్ స్టే రిసార్ట్, ఐనవోలులో స్థానిక శాసనసభ్యులు కె.ఆర్.నాగరాజు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో, వారి సూచనల మేరకు, వారికి పూర్తి సమాచారం అందించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ పటిష్టత కోసం ఐనవోలు మండల స్థాయి కమిటీలను పారదర్శకంగా, క్రియాశీలక కార్యకర్తలతో భర్తీ చేయడంపై అబ్సర్వర్లతో కలిసి లోతుగా చర్చించి ఆశావాహుళ నుండి మండల కమిటీకి 51 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా హనుమకొండ డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత మండల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, సొసైటీ చైర్మన్లు , సీనియర్ నాయకులందరితో చర్చించి, అందరి ఏకాభిప్రాయంతోనే సమర్థవంతమైన కమిటీలను ఎన్నుకుంటున్నాము. ప్రజా సమస్యలపై పోరాడే వారికే ఈ కమిటీల్లో చోటు ఉంటుంది," అని స్పష్టం చేశారు. అబ్సర్వర్లుగా నియమితులైన కుందూర్ వెంకట్ రెడ్డి, పింగిలి వెంకట్ రెడ్డి, బిల్లా ఉదయ్ రెడ్డి, మదన్ గౌడ్, పి. సారంగపాణి ల పర్యవేక్షణలో కమిటీల ఎంపిక ప్రక్రియ అత్యంత సమన్వయంతో సాగుతోందని, నూతన కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పించడమే కాకుండా, మహిళలకు 30% ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మండల స్థాయి కార్యవర్గాల్లో 35 సంవత్సరాల పైబడిన, పార్టీ సిద్ధాంతాల పట్ల అవగాహన ఉన్న వారికే ప్రాధాన్యతనిస్తున్నట్టు, మండల అధ్యక్షులు, సభ్యులుగా కనీసం మూడు సంవత్సరాలు పార్టీలో చురుకైన పాత్ర పోషించిన వారినే ఎంపిక చేస్తున్నామని స్పష్టం చేశారు. జిల్లా పరిధిలో రెండు సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకున్న మండల అధ్యక్షులను నిబంధనల ప్రకారం మారుస్తూ, కొత్త రక్తాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు, మండల ముఖ్య నేతలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.



