ఇండ్ల గణన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

ఇండ్ల గణన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి

  • జన గణన తెలంగాణ రాష్ట్ర సంచాలకులు భారతి హోళ్ళికేరి

విశ్వంభర, మహబూబాబాద్:  జనగణనలో భాగంగా చేపట్టనున్న ఇండ్ల గణన  ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జన గణన తెలంగాణ రాష్ట్ర సంచాలకులు భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఇండ్ల గణన కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంచాలకులు మాట్లాడుతూ, జనగణన కార్యక్రమంలో భాగంగా మే 11వ తేదీ నుండి నిర్వహించే ఇండ్ల గణన ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. ప్రక్రియ నిర్వహణలో భాగంగా ఇండ్ల జాబితా బ్లాక్ లను రూపొందించాలని, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం, మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలని తెలిపారు. ప్రక్రియ నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, ఇండ్ల గణన, జనగణన జాబితా ప్రకారం అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో దోహదపడతాయని తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ హాజరు కాగా, వీడియో కాన్ఫరెన్స్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,  జన గణన కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న ఇండ్ల గణన కార్యక్రమాన్ని నిబంధనల ప్రకారం అధికారుల సమన్వయంతో పకడ్బందీగా చేపడతామని తెలిపారు. జిల్లాలో గుర్తించబడిన ఇండ్ల జాబితా బ్లాక్ లలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల సమన్వయంతో ఇండ్ల గణన ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందు కొరకు నియమించబడిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు త్వరలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, ప్రక్రియ నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్, సిపిఓ శ్రీనివాసరావు, ఎస్ఓ అశోక్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags: