విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలను  పరిష్కరించాలి

విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలను  పరిష్కరించాలి

  • సీఎం కు ఎమ్మెల్సీ నెల్లికంటి  బహిరంగ లేఖ 

విశ్వంభర, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో గత 25-30 సంవత్సరాలుగా అహర్నిశలు శ్రమిస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం  తీవ్రంగా ఖండించారు. విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలను  పరిష్కరించాలని సిఎం కు ఎమ్మెల్సీ నెల్లికంటి  బహిరంగ లేఖ రాశారు.  తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్  8నుంచి నిరవధిక సమ్మెకు దిగిన ఆర్టిజన్ కార్మికులకు తన మద్దతు ప్రకటించారు. గత ప్రభుత్వం 2017లో కార్మికులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి, ప్రమోషన్లు, సెలవులు ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు. ఆర్టిజన్ల కోసం ప్రత్యేకంగా 2020లో కొత్త సర్వీసు రూల్స్ తెచ్చి వారిపై రుద్దడం అన్యాయమన్నారు. తాగునీరు, లైటింగ్ వంటి కనీస సదుపాయాలు కూడా లేని సబ్ స్టేషన్లలో, తీవ్రమైన సిబ్బంది కొరతతో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. ప్రభుత్వం  తక్షణమే స్పందించి విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలను  పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ లో డిమాండ్ చేసారు.

Tags: