నాణ్యత లేని ప్రభుత్వ భవన నిర్మాణాలు  

నాణ్యత లేని ప్రభుత్వ భవన నిర్మాణాలు  

 విశ్వంభర, రామన్నపేట: పది మందికి ఉపయోగపడే ఏ నిర్మాణాలను అయినా పది కాలాలు ఉండాలని నిర్మాణాలు చేపడుతారు,  రాజుల సొమ్ము రాళ్ళపాలు అంటారు, రాజులు కట్టించిన  నిర్మాణాలు అయినా ఏండ్ల కింద కట్టినవి ఇంకా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. కానీ ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ మండల పరిషత్తు భవనం పక్కనే ఉన్న స్త్రీశక్తి ఉపాధి హామీ భవనం నిర్మాణం అయిన పన్నెండు, పదమూడు సంవత్సరాలకే స్లాబ్ పెచ్చులు ఊడుతోంది. ఈ స్త్రీశక్తి ఉపాధి హామీ భవనం  హాలులో కూర్చోవడాని ప్రజలు, సమావేశాలు నిర్వహించడానికి అధికారులే భయపడుతున్నారు. ఎప్పుడు ఎవరి తలలపై పెచ్చులు ఊడి పడి గాయాలవుతాయో, ఎవరి ప్రాణాలకు ఏమి ప్రమాదం వస్తుందో అనే భయాందోళనలో వారంతా గడుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, నాణ్యత లేని స్లాబ్ కు మరమ్మతులు చేయాలని, దీనిని దృష్టిలో ఉంచుకొని అయినా ఇకముందు నిర్మించే నిర్మాణాలను కాస్త నాణ్యంగా అయినా కడితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు.

Tags: