కేజీబీవీ టీచర్లను రెగ్యులరైజ్ చేయాలి

కేజీబీవీ టీచర్లను రెగ్యులరైజ్ చేయాలి

  • టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ చుంచు శ్రీశైలం డిమాండ్

విశ్వంభర, మహబూబాబాద్: గత 14 ఏళ్లుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్న కేజీబీవీ ఉపాధ్యాయులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ చుంచు శ్రీశైలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీపీటీఎఫ్ మహబూబాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాలల సందర్శన, సమస్యల సేకరణ కార్యక్రమంలో భాగంగా కేజీబీవీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మహాత్మ జ్యోతిబాపూలే, మోడల్ స్కూల్ అనంతారం పాఠశాలల్లో జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. వివిధ మేనేజ్‌మెంట్‌ల పేరుతో పాఠశాలలను విభజించి ఉపాధ్యాయులను వేర్వేరుగా చూడటం సరికాదన్నారు. మోడల్ స్కూళ్లను టీపీఎస్‌లుగా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించడం ప్రచార ఆర్భాటమేనని విమర్శించారు. కొత్త వ్యవస్థల కంటే ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పాఠశాలలను అన్ని సౌకర్యాలతో బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి రాచకొండ ఉపేందర్, మండల అధ్యక్షుడు ఘనపురం బిక్షపతి, ప్రధాన కార్యదర్శి సారెడ్డి రామలింగారెడ్డి, సీనియర్ నాయకులు సోమ విష్ణువర్ధన్, నేలపోగుల దుర్గయ్య, కోడూరి శ్రీనివాస్, గులగట్టు రఘు, దబ్బా నరేష్, బానోత్ మంగీలాల్, బి. సురేష్, భూక్య రమేష్, గుగ్గిళ్ల నాగరాజు, కొంపెల్లి వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/kgbv-teachers-should-be-regularized/article-18699

Tags:  

Advertisement

LatestNews

కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్
సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు
పెద్దవంగర మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం
అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ యాదవ్