ఫలించిన రాపోలు వీరమోహన్ ప్రయత్నం
- చేనేత టెండర్ విధానం రద్దు
ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయ
విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల ఉపాధి పై ప్రభావం చూపేలా తీసుకువచ్చిన వస్త్రాల కొనుగోలు టెండర్ విధానానికి తెలంగాణ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ప్రభుత్వం అమలు చేసిన టెండర్ ప్రక్రియ రద్దు చేస్తూ టెస్కో నుంచే కొనుగోలు కొనసాగించాలని ఆదేశించింది. ఈ విషయంపై గత కొన్ని రోజుల నుండి తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ ఆధ్వర్యంలో ఎందరినో రాజకీయ నాయకులను కలిసి మాజీ చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి టెండర్ ప్రక్రియ అమలు అయితే కార్మికులకు జరిగే నష్టం గురించి విన్నవించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీ విజయశాంతి ని కలిసి టెండర్ విధానం అమలయితే చేనేత కార్మికులకు వాటిల్లే నష్టం గురించి వివరించడం జరిగింది. అదే విధంగా ఎన్నో గ్రామాలు తిరుగుతూ చేనేత కార్మికులకు ఈ టెండర్ విధానం అమలైతే వచ్చే నష్టం గురించి వివరిస్తూ పోరాటం కొనసాగించిన తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ హైకోర్టు తీర్పు రావడానికి తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఎంతో కృషి చేసిందని మునుముందు చేనేత కార్మికులకు చేనేత పరిశ్రమకు అండగా ఉంటాం ప్రభుత్వానికి కార్మికులకు మధ్యన వారధిలా పనిచేస్తూ చేనేత పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ తెలియజేశారు. ఈ ప్రక్రియ రద్దు కావడానికి నేను తలపెట్టిన ప్రతి పిలుపుకు నా వెన్నంటి నడిచినటువంటి తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్యవేదిక కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు.



