అర్జెంటుగా డ్రైవర్లు కావలెను

అర్జెంటుగా డ్రైవర్లు కావలెను

విశ్వంభర, నిజామాబాద్ :  భారీ వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన డ్రైవర్లు ఆర్టీసీలో తాత్కాలిక డ్రైవర్లుగా పనిచేసేందుకు తమను సంప్రదించాలని ఆర్మూర్ ఎంవీఐ రాహుల్ కుమార్ గురువారం తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ సంస్థలో తాత్కాలిక డ్రైవర్లుగా పనిచేసేందుకు డ్రైవింగ్లో అనుభవం కలిగిన హెవీ వాహనాల డ్రైవర్లు తనను సంప్రదించాలని కోరారు. మరిన్ని వివరాల కోసం ఆర్మూర్ మోటార్ వాహన తనిఖీ కార్యాలయంలో సంప్రదించవచ్చని లేదా 9849666680 ఫోన్ నంబర్లో
సంప్రదించాలని సూచించారు

Tags: