అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు
- జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
విశ్వంభర, సూర్యాపేట: అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు వచ్చేలా చూడాల్సిన బాధ్యత జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ పై ఉందని, అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్ కార్డులు త్వరలో అందజేస్తామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం తన చాంబర్లో జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే గురుతర బాధ్యత పత్రికలు, చానళ్లపై ఉందని, అలాంటి విధులు నిర్వహించే జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డులు అర్హత ఉన్న వారికి అందాలని, ఆ విధంగా జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈనెల 24వ తేదీ శుక్రవారం సాయంత్రం లోగా దరఖాస్తు చేయని పాత్రికేయులు వెంటనే తమ దరఖాస్తులను ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని కలెక్టర్ సూచించారు. నూతనంగా ఎంపికైన అక్రెడిటేషన్ కమిటీ సభ్యులు చలసాని శ్రీనివాసరావు, వజ్జే వీరయ్య, షేక్ సైదా, కోల నాగేశ్వరరావు, ఎండి.ఖలీల్ అహ్మద్, డాక్టర్ బంటు కృష్ణ, రెబ్బ విజయకుమార్, శంకర్ మంచి రవీందర్ శర్మ, బత్తుల మల్లికార్జున్, బుక్క ఉపేందర్ లకు జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువ సమర్పించారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సుచరిత, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ దర్శనం మల్లేశం, జిల్లా పౌర సంబంధాల అధికారి వల్లోజి శ్రీనివాసరావు ఉన్నారు.



