పనిచేయని పంపిణీ వడ్లు పట్టే యంత్రాలు

పనిచేయని పంపిణీ వడ్లు పట్టే యంత్రాలు

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, లక్ష్మాపురం గ్రామంలోని ఐకెపి ఆద్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వం పంపిణీ చేసిన వడ్లు పట్టే యంత్రం ఉపయోగంలో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల కోసం ప్రభుత్వం పంపిణీ చేసిన వడ్లు పట్టే యంత్రం ఉపయోగంలో లేకపోవడంతో, బయట ప్రైవేటుగా వడ్లు పట్టే యంత్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల రైతులకు అదనపు ఖర్చులు, సమయ నష్టం కలుగుతోంది. వెంటనే వడ్లు పట్టే యంత్రం వినియోగంలోకి తెచ్చి, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు సంబందిత అధికారులను కోరుతున్నారు, తద్వారా రైతులపై అదనపు ఆర్ధిక భారం పడకుండా ఉంటుంది. మరోవైపు, యాదాద్రి భువనగిరి పొరుగు జిల్లాలైన నల్గొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో ఇలా ధాన్యం పట్టే అవసరం లేకుండా వడ్లు ఆరబెట్టి సరైన తేమ శాతం రాగానే వడ్లు తూకం వేసి బస్తాలకు ఎత్తుతారు. ఒక యాదాద్రి భువనగిరి జిల్లాలోనే ఈ నిబంధన ఎందుకు? అని జిల్లాలోని రైతులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఈ విషయంపై సరైన నిర్ణయం తీసుకుని ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు

Tags: