గరం గరంగా  మోపాల్ గ్రామసభ 

గరం గరంగా  మోపాల్ గ్రామసభ 

విశ్వంభర, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం గ్రామపంచాయతీ కార్యాలయంలో  గ్రామసభ నిర్వహించారు గ్రామ సర్పంచ్ రవి అధ్యక్షతన గ్రామసభ ప్రారంభించారు.  అంగన్వాడి కేంద్రాలు పరిశుభ్రత ఉండటం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య తలెత్తకుండా గ్రామంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని  గ్రామపంచాయతీ కార్యవర్గానికి వివరించారు. పాలకవర్గం స్పందించి ఎక్కడ వాటర్ సమస్య లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. పావుల వడ్డీ రుణాలపై అవగాహన కల్పించారు. 
 జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ పర్మిషన్ తీసుకొని విగ్రహ ప్రతిష్టాపన చేయాల్సిందిగా ఏఎస్ఐ కోరారు. ఎస్సీ భవనం కోసం   గ్రామస్తులు అధికారులకు వినతి పత్రం అందించారు. ఎస్సీ కులస్తులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా మా స్థలాన్ని మేము సంఘ భవనం కట్టుకుంటే కొందరు మాపై కక్ష కట్టి మమ్మల్ని ఇబ్బందులు కురిచేస్తున్నారని అన్నారు. అనంతరం సంఘ భవనం కు పర్మిషన్ ఇవ్వాలని వినతి పత్రం అందించారు.  కరెంటు మీటర్ కూడా ఇప్పించాలని గ్రామ సర్పంచ్ వినతిపత్రం అందించారు. లైన్మెన్ గైరాజరీ కావడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags: