పద్మశాలి దసరా మేళా కరపత్రం విడుదల 

-ముఖ్య అతిధిగా పాల్గొన్న చిలివేరు కాశీనాథ్ 

పద్మశాలి దసరా మేళా కరపత్రం విడుదల 

విశ్వంభర, ఎల్బీనగర్ :  పద్మశాలి సంఘం ఎల్బీనగర్ సర్కిల్  ఆధ్వర్యంలో 23వ పద్మశాలి దసరా మేళా కరపత్రం ను  మన్సూ రాబాద్ లోని పాలాది పరమేశ్వర్ వృద్ధాశ్రమం లో ఆవిష్కరణ చేశారు. సంఘం అధ్యక్షులు పున్న గణేష్  , దసరా మేళా కమిటీ చైర్మన్ కౌకుంట్ల రవితేజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా చిలువేరు కాశీనాథ్ , గుజ్జ సత్యం పాల్గొని కరపత్రం విడుదల చేసారు. అక్టోబర్ 12 వ తేదీ నాడు ఆటో నగర్ హరిణి వనస్థలి లో ఈ కార్యక్రమం  జరగనుంది. ఈ సందర్బంగా చిలివేరు కాశీనాథ్ మాట్లాడుతూ గత 23 సం. రాలుగా నిర్విరామంగా జరుపుతున్న ఈ కార్యక్రమం చాలా విశిష్టత కలిగిందని చెప్పుకోవచ్చు . ఇలాంటి దసరా మేళాలు  మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఎల్బీనగర్ సంఘం వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం ప్రెసిడెంట్ గుంటక రూప సదాశివ్ , గ్రేటర్ హైద్రాబాద్ పద్మశాలి మహిళా ప్రెసిడెంట్ పోరండ్ల శారదా , పద్మ శ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్య, గుర్రం శ్రవణ్ , గడ్డం లక్ష్మి నారాయణ , వేమూరి రాము నేత , రాపోలు సుధాకర్ , నోముల రామ్ ప్రకాష్ ,పెద్ద ఎత్తున మహిళలు , కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Tags: