48 వేల ఓట్లతో పద్మశాలి సంఘం ఎన్నికలు
విశ్వంభర, హైద్రాబాద్ : తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రిజిస్టర్ 98/2023 అధ్యక్ష ఎన్నికలు ఆగష్టు 18 న జరగనున్నాయి.ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక బ్యాలెట్ పేపర్ తో ఎలక్షన్లు జరగబోతున్నాయని తెలిపారు. రాష్ట్ర అధ్యక్ష అభ్యర్థిగా పోటీల్లో ఉన్నవల్లకాటి రాజకుమార్ కి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు గోశిక యాదిగిరి , మ్యాడం బాబురావు ,24 జిల్లాల అధ్యక్షులు సీనియర్ పద్మశాలి పెద్దలు అందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలిపారు. కావున తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కుల బాంధవులు అందరూ కూడా మగ్గం గుర్తుకు ఓటు వేసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న వల్లకాటి రాజకుమార్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పద్మశాలి నాయకులు కోరారు. భారతదేశ చరిత్రలోనే ఒక సంఘంలో 48 వేల ఓట్లతో ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి అని పలు సంఘాల నాయకులూ తెలిపారు . ఈ పద్మశాలీలంతా ఈ యొక్క (టీఆర్పీఎస్ ) 98/2023 సభ్యత్వం పొందిన అందరూ కూడా ఈ ఎన్నికలలో పాల్గొని వల్లకాటి రాజ్ కుమార్ గెలిపించాలని కోరారు.