స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలీలు సత్తా చాటాలి. - రాపోలు వీర మోహన్
విశ్వంభర, హైదరాబాద్ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు విడతలలో చేపట్టిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలలో పద్మశాలీలు సత్తా చాటాలని తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు తుర్క యంజాల్ లోని వారి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలీలు అంత మీ మీ గ్రామాలలో వార్డ్ మెంబర్ నుండి సర్పంచ్ వరకు ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించే దిశగా సంఘటితమై సమన్వయం తో కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీసీ రాజ్యాధికారం దిశలో బీసీలలో అగ్రబాగమైన పద్మశాలీలు అన్ని బీసీ , జనరల్ స్థానాల్లో పెద్ద ఎత్తున పోటీ చేసి స్థానిక సమరానికి రాజకీయాలకు పునాది రాయి అవ్వాలని వారు అన్నారు. రాష్ట్రం లో పద్మశాలి సామాజిక వర్గపు జనాభా సుమారు పాతిక నుండి ముప్పై లక్షల మధ్య ఉంటుంది. కానీ ప్రభుత్వం సర్వేలో తప్పుడు గణాంకాలతో మన సంఖ్య తక్కువగా చూపించారు. కావాలని చేసిన చర్యగా ఆనాడే ప్రభుత్వానికి తెలియ చేయడం జరిగింది. ఇంత జనాభా ఉండి రాజకీయంగా మన ఎదుగుదల సరిగా లేని కారణం ఏమిటనీ ప్రశ్నించారు. చదువుకున్న యువతి యువకులు విద్యార్థులు ముందుకు రాకపోవడం, ఇప్పుడు వచ్చిన మంచి అవకాశాన్ని యువత, సామాజిక వర్గం రాజకీయ అరంగేట్రం చేసి రాజకీయ రంగం లో మన బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్ఘాటించారు. గ్రామాలలో జరిగే ప్రతి కార్యక్రమం పద్మశాలీలు పాల్గొనాలి. సామాజిక సేవలో ముందుండాలి. అన్ని సామాజిక వర్గాల వారితో మమేకమై సంఘీభావంగా ఉండాలిఅప్పుడే మన రాజకీయ ఎదుగుదలకు దోహద పడతాయి.మనం రాజకీయంగా లేకపోవడం వలన మన సమాజం తీవ్రంగా నష్టపోతుంది. యావత్తు సామాజిక వర్గానికి నా మాటలను మీరు భాద్యతగా చేపడుతారని రాష్ట్రంలో ప్రతి గ్రామానికి జరిగే గ్రామ సర్పంచ్ , వార్డ్ మెంబర్ గా పద్మశాలి వారిని గెలిపించే భాధ్యత స్థానిక పద్మశాలి సంఘాలు ,చేనేత సహకార సంఘాలు , చేనేత కార్మిక సంఘాలు వీరికి తోడుగా పద్మశాలి యువత భాద్యతలు తీసుకొని ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి జెల్ల రఘు , గ్రేటర్ హైదరాబాద్ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు ఏలే మహేష్ నేత , ఉపాధ్యక్షులు చెరుకు విజయ్ , కోశాధికారి బండ తిరుమల వార ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



