కొర్ర రమేష్ కు గద్దర్ పురస్కారం

కొర్ర రమేష్ కు గద్దర్ పురస్కారం

  విశ్వంభర, డిండి: కొత్త తండాలో  ప్రజా యుద్ధనౌక, అమరగాయకుడు గద్దర్ జయంతిని పురస్కరించుకుని  ప్రతిష్టాత్మక  గద్దర్ స్ఫూర్తి పురస్కారాన్ని ఆపరేషన్ క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ నాయక్ కు అందజేశారు. గురువారం నాడు హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలో పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్, ఇండో కెనేడియన్ యూత్ కౌన్సిల్,  పుడమి సాహితీ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. సామాజిక, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో రమేష్ నాయక్  చేస్తున్న కృషికి, సమాజాన్ని జాగృతం చేయడంలో ఆయన చూపుతున్న చొరవకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ పురస్కారం కేవలం ఒక సన్మానం మాత్రమే కాదు,  ఇది గద్దర్  కలలు కన్న సామాజిక మార్పుకు నిదర్శనమని  ఉన్నత విద్యావంతుడై ఉండి కూడా, సమాజంలోని అట్టడుగు వర్గాల కోసం నిస్వార్థంగా కృషి చేసే వ్యక్తులకు ఇచ్చే ఈ గౌరవమని , రమేష్ నాయక్  సేవలు గద్దర్ ఆశయాలకు అద్దం పడుతున్నాయని ప్రముఖులు కొనియాడారు. ఈ సందర్భంగా రమేష్ నాయక్  మాట్లాడుతూ,  ఈ పురస్కారం దక్కడంలో కీలక పాత్ర పోషించిన తన ఆపరేషన్ క్యూర్ ఫౌండేషన్ బృంద సభ్యులకు, మద్దతుదారులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. కొత్త తండా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు  బాల్‌రాజ్  ఎస్ జి టి  అందించిన విశేష ప్రోత్సాహం, సహకారం మరువలేనిదని ఆయన కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ అవార్డు రావడంలో ఆయన కృషి ఎంతో ఉందని ప్రత్యేకంగా పేర్కొన్నారు గద్దర్  పేరుతో పురస్కారం అందుకోవడం గర్వకారణంగా ఉందని  ఈ గౌరవం నాపై సామాజిక బాధ్యతను మరింత పెంచిందని  భవిష్యత్తులో గద్దర్  స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని రమేష్ నాయక్  ఈ సందర్భంగా వెల్లడించారు. తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ డా జి.వి. వెన్నెల గద్దర్ , మాజీ కేంద్ర మంత్రి డా సముద్రాల వేణుగోపాలాచారి  చేతుల మీదుగా ఈ పురస్కార ప్రదానం జరిగింది. నల్గొండ జిల్లా, డిండి మండలం, కొత్త తండాకు చెందిన రమేష్ నాయక్, ఐ ఐ టి  బి.హెచ్.యు  విద్యార్థి. ప్రస్తుతం డ్రగ్ రెగ్యులేటరీ అఫైర్స్ లో అసిస్టెంట్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సేవ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో, ప్రత్యేక అతిథిగా  రొయ్యురు శేష సాయి వ్యవస్థాపకులు, ఇండో కెనడియన్ యూత్ కౌన్సిల్, డా చిలుముల బాలరెడ్డి వ్యవస్థాపకులు, పుడమి సాహితీ వేదిక, ధారావత్ బాల్సన్ నాయక్ నేషనల్ చీఫ్ డైరెక్టర్, అంటి కరప్షన్ ఫౌండేషన్ అఫ్ ఇండియా, శ్రీ యామినేని ఉప్పల్ రావు వ్యవస్థాపకులు,  ఈస్ట్ ఇండియా అగరవుడ్ పీప్ట్ లిమిటెడ్ , కొర్ర సేవ కోశాధికారి, ఆపరేషన్ క్యూర్ ఫౌండేషన్, కొర్ర నవీన్ జాయింట్ సెక్రటరీ, ఆపరేషన్ క్యూర్ ఫౌండేషన్, ముదావత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Tags: