పరకాల మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం 

పరకాల మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం 

  •  హనుమకొండ కాంగ్రెస్ నాయకుడు ఈర్ల  చిన్ని

విశ్వంభర,  హనుమకొండ :హనుమకొండ జిల్లాలోని పరకాల పురపాలక సంఘంలో 22 వార్డులలో గెలిచి పరకాల కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని బ్లాక్ కాంగ్రెస్ జిల్లా నాయకులు పరకాల మున్సిపల్ 6వ వార్డు ఎన్నికల ఇంచార్జ్ ఈర్ల చిన్ని అన్నారు. శుక్రవారం పరకాల పురపాలక సంఘం ఎన్నికలలో భాగంగా ఆరో వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పబ్బు సునీత శ్రీనివాస్ గౌడ్ ల నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈర్ల చిన్ని హసన్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆత్మకూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తంగళ్ళపల్లి తిరుపతి లు హాజరయ్యారు. పరకాల పురపాలక సంఘం  6వ వార్డు నుంచి నామినేషన్ వేయడానికి అభ్యర్థి పబ్బ సునీత శ్రీనివాస్ గౌడ్ తో కలిసి పరకాల పురపాలక సంఘం కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్బంగా చిన్ని మాట్లాడుతూ, అందరికీ అవకాశాలు రావు, ప్రజధారణ ఉండి గెలిచే అవకాశం ఉన్న వారికే పార్టీ టికెట్ ఇవ్వడం జరిగిందని అన్నారు. అవకాశం రాని వారు నిరుత్సాహపడవద్దు,కష్టపడే కార్యకర్తలను పార్టీ కాపాడుకుంటుందని   తెలిపారు.  పరకాల మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందరం కలిసి కట్టుగా పని చేసి పరకాల మున్సిపాలిటీ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.   అనంతరం పబ్బ సునీత శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ, మున్సిపాలిటీ ఎన్నికలను ప్రతీ ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ గెలుపు కోసం పని చేయాలని తెలిపారు. మనందరం కలిసి కట్టుగా పని చేసి  22వార్డులలో గెలిచి ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పార్టీ బలం ఏంటో చూపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు వార్డు ఇంచార్జ్ లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags: