విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించిన సర్పంచ్
On
విశ్వంభర, మేడారం : మేడారం జాతర కారణంగా గుండాల నుండి బండకొత్తపల్లి వచ్చే ఆర్టీసీ బస్సులకు అంతరాయం కలిగింది. దీంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా గ్రామ సర్పంచ్ గద్వాల ఉపేందర్ ముందస్తు చర్యలు తీసుకున్నారు. మోడల్ స్కూల్‌కు వెళ్లే విద్యార్థులకు గత మూడు రోజుల నుండి ఆటోల సౌకర్యం కల్పించారు. ఈ సందర్బంగా విద్యార్థులు సర్పంచ్‌కు ధన్యవాదాలు తెలిపారు.



