తెలంగాణ TET ప్రాథమిక 'కీ' విడుదల
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET-2026) రాసిన అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. పరీక్షకు సంబంధించిన ప్రాథమిక 'కీ' శుక్రవారం విడుదలైంది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET-2026) రాసిన అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. పరీక్షకు సంబంధించిన ప్రాథమిక 'కీ' శుక్రవారం విడుదలైంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, తెలంగాణ టెట్ చైర్మన్ డాక్టర్ నవీన్ నికోలస్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లు మరియు ప్రాథమిక 'కీ'ని పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక 'కీ'లో ఏవైనా సమాధానాలపై సందేహాలు లేదా అభ్యంతరాలు ఉంటే, అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించారు. ఫిబ్రవరి 1 వరకు అభ్యంతరాలను తెలిపేందుకు అవకాశం ఇచ్చింది. అభ్యంతరాలను కేవలం అధికారిక వెబ్‌సైట్ లింక్ ద్వారా మాత్రమే సమర్పించాలి. ఇతర మార్గాల్లో (మెయిల్ లేదా పోస్ట్) పంపే వాటిని పరిగణనలోకి తీసుకోరు.



