11వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి కుమారస్వామి 

విశ్వంభర,  హనుమకొండ: వరంగల్ జిల్లా  వర్ధన్నపేట పురపాలక సంఘం బిఆర్ఎస్ పార్టీ 11వ  వార్డు అభ్యర్థిగా వర్ధన్నపేట నియోజకవర్గం బి ఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్  మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుమార్ యాదవ్ ను ప్రకటించారు. ఈ సందర్భంగా కుమార్ యాదవ్ మాట్లాడుతూ, నా మీద నమ్మకంతో అవకాశం ఇచ్చిన  వర్ధన్నపేట నియోజకవర్గం  బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు,  మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ కు,  నియోజకవర్గ మండల జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 11వ   వార్డు ఓటర్ మహాశయులు నా మీద నమ్మకంతో మీ ఓటు వేసి నన్ను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి పాటుపడతానని అన్నారు.

Tags: