ఘనంగా గాంధీ వర్ధంతి
విశ్వంభర, గౌలిపుర: జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా యాకుత్పురా ఏ బ్లాక్ ప్రెసిడెంట్ మామిడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. యాకుత్పురా కాంగ్రెస్ ఇంచార్జ్ రవిరాజ్ మాట్లాడుతూ, ఈరోజు అమరవీరుల దినోత్సవం పాటిస్తూ మహాత్ముని సత్యం, అహింసా సిద్దాo తాలను స్మరించు కుంటున్నామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం హిందూయిజం పేరు చెబుతూ ప్రజలను మభ్యపెడుతూ పరిపాలన సాగిస్తుందని మనమంతా ఏకమై మహాత్మా గాంధీ ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో యాకుత్పురా ఇంచార్జ్ కె రవిరాజ్, టిపిసిసి అధికార ప్రతినిధి అల్లం భాస్కర్, టిపిసిసి సెక్రెటరీ కృష్ణ కుమార్, భీమ్ అర్జున్ రెడ్డి, నలిని గౌడ్, గిటార్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు రాజు యాదవ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముత్యం యాదవ్,సుభాష్,డల్లు శివ, బండి సురేష్ కుమార్ గౌడ్, అబ్దుల్ గని, ఫిరోజ్ జానీ, ముస్తఫా, సయ్యద్ జిలోవర్, అభిబ్ బై, తదితర సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.



