ఇంటర్ పరీక్ష ఫీజుకు మరో అవకాశం ఇవ్వాలి

ఇంటర్ పరీక్ష ఫీజుకు మరో అవకాశం ఇవ్వాలి

 విశ్వంభర, హైదరాబాద్ : కార్పొరేట్ కాలేజీలలో టెక్నికల్ సమస్యలు, నిర్లక్ష్యం కారణంగా బోర్డు పరీక్షల ఫీజు కట్టలేకపోయిన ఇంటర్ విద్యార్థులకు చివరి అవకాశం ఇవ్వాలని తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శిని కోరింది. ఈ మేరకు జాయింట్ సెక్రటరీ మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడు అరుణ్ కుమార్ మాట్లాడుతూ , శ్రీ చైతన్య, నారాయణ, రిజొనెన్స్, విద్యాపీట్, వశిష్ట వంటి కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ఫీజులు మాత్రమే వసూలు చేసి, విద్యార్థుల బోర్డు పరీక్షల ఫీజులు కట్టడం, ఆన్‌లైన్ అడ్మిషన్లు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. కార్పొరేట్ కాలేజీల ధన దాహానికి విద్యార్థుల భవిష్యత్తు నష్టపోకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకొని, పరీక్ష ఫీజు కట్టుకోవడానికి ప్రత్యేక అనుమతి ఇవ్వాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు రమేష్ యాదవ్, శివ పాల్గొన్నారు.

Tags: