ఘనంగా భగీరథ జయంతి

ఘనంగా భగీరథ జయంతి

 విశ్వంభర, బంజారహిల్స్ :  సగర కులస్తుల ఆరాధ్య దైవం భగీరథ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భవన్‌, బజారహిల్స్ లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భగీరథుడు సమాజానికి చూపిన మార్గంలో ముందుకు సాగాలని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హౌస్ ఫెడ్ డైరెక్టర్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఐలినేని కిషన్ రావు మాట్లాడుతూ, భగీరథుని త్యాగం, కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. సగర సంగం అధ్యక్షుడు విజయేంద్రసాగర్ మాట్లాడుతూ, యువత భగీరథుని స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ మాజీ చైర్మన్ రాకేష్ , విజయేంద్ర సాగర్, సగర నాయకులు రాజు , వెంకటస్వామి తదితరులు పాల్గొని భగీరథునికి నివాళులర్పించారు.

Tags: