పెద్దాయన లేని మొదటి పుట్టిన రోజు మనసు బాధగా ఉంది
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారె
విశ్వంభర, సూర్యాపేట: గత 30 సంవత్సరాలుగా ప్రతి జన్మ దినోత్సవాన్ని మాజీ మంత్రివర్యులు దివంగత సీనియర్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి దామోదర్ రెడ్డితో కలసి జరుపుకున్నానని ప్రస్తుతం ఆయన లేని బాధ మనసు నిండా ఉందని అందుకే నేడు నిర్వహించే తన జన్మదిన వేడుకలను ఆడంబరాలు లేకుండా నిరాడంబరంగా జరపాలని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తన అభిమానులు నిరాశ చెందవద్దని గత 30 సంవత్సరాలుగా ప్రతి జన్మదినోత్సవన్నీ నా అభిమాన నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి తో కలిసి నిర్వహించు కున్నానని అన్నారు. దామన్న పుట్టినరోజు అయినా తన పుట్టినరోజు అయినా ఒకేలా నిర్వహించుకున్నామని అలాంటిది ఆయన లేకుండా జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం బాధగా ఉందన్నారు. అందుకే దామన్న తన జీవితమంతా ప్రజాసేవకు పాటుపడ్డారని ఆయన బాటలో నడుస్తూ తన పుట్టినరోజున ఆడంబరాలకు పోకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కార్యకర్తలకు నాయకులకు పిలుపునివ్వడం జరుగుతుందన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా ఏలాంటి కేకులు కట్ చేయకుండా, బాణాసంచాలు పేల్చకుండా వీలైతే సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మిత్రులు శ్రేయోభిలాషులు ఈ విషయాన్ని గమనించి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.



