బీజేపీ సీనియర్ నేత దయాకర్ రెడ్డి దంపతులు తెలంగాణ జాగృతిలో చేరిక

బీజేపీ సీనియర్ నేత దయాకర్ రెడ్డి దంపతులు తెలంగాణ జాగృతిలో చేరిక

విశ్వంభర, సంగారెడ్డి: సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన మాజీ బీజేపీ సీనియర్ నాయకుడు కలబ్గూర్ దయాకర్ రెడ్డి, ఆయన సతీమణి కలబ్గూర్ సంఘమిత్ర తెలంగాణ జాగృతి చేరారు. తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారు అధికారికంగా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత దంపతులకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో కేడీఆర్ యువసేన సభ్యులు గోపాల్ రెడ్డి, మనోజ్ రెడ్డి, గోపాల్ యాదవ్, నరసింహ రెడ్డి, నాగేశ్, ఆనంద్ యాదవ్, నవీన్, హేమ, రాకేష్ గుప్తా తదితరులు సుమారు 200 మంది కార్యకర్తలతో పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి నాయకుడు బాలయ్య కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ సమాజ అభివృద్ధి కోసం తెలంగాణ జాగృతి నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. కొత్తగా చేరిన నాయకులు, యువత పార్టీ బలోపేతానికి తోడ్పడతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.  సంఘమిత్ర, దయాకర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ జాగృతి సిద్ధాంతాలు తమను ఆకర్షించాయని, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేడీఆర్ యువసేన సభ్యులు  ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Tags: