పాఠశాలల్లో రోడ్ సేఫ్టీ పై అవగాహన
విశ్వంభర, నెల్లికుదురు: మండలంలోని ఆలేరు హై స్కూల్, లాలు తండా ప్రాథమిక, మదనతుర్తి, రామన్నగూడెం ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎంఈఓ రాందాస్, ఆయా పాఠశాలల హెచ్ఎంల ఆధ్వర్యంలో వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడకంతో ప్రభావాలు, నివారణా మార్గాలపై, అందరికీ విద్య, మత్తు పదార్థాల వినియోగం వాటి అనర్ధాలు, నిషేధం, రహదారి భద్రత - ఆధునిక సాంకేతికత, వినూత్న ఆలోచనలతో ప్రమాదాలను తగ్గించడం వంటి అంశాలపై ఉపన్యాస, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ను ధరించాలని హెల్మెట్ ను వినియోగించడంతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్లకార్డులు ధరించి నినాదాలతో పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ, బైక్పై వెళ్లేప్పుడు హెల్మెట్స్ ధరించాలని, కార్ల లో పోయే అప్పుడు సీటు బెల్టు పెట్టుకోవాలని మీ అమ్మానాన్నలకు చెప్పండని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు, తదితరులు పాల్గొన్నారు.



