రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
On
విశ్వంభర, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత రైతు భరోసా నిధుల విడుదల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గాంధీ భవన్ లో తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బోయ నగేష్ , కుమార్ రావు ,ఇతర ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి అని కొనియాడారు. ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పని చేస్తుందని తెలిపారు.



