అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు

అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు

విశ్వంభర, సిద్దిపేట: గ్రామాల్లో అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా  తమ ప్రభుత్వం పనిచేస్తోందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పూజల హరికృష్ణ అన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని హామీనిచ్చారు. చిన్నకోడూరు మండలం గోనేపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్దిదారు ఆకుల నిత్య-అశోక్ దంపతుల నూతన గృహ ప్రవేశానికి మంగళవారం హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజల మాట్లాడుతూ పేదల కళ్లలో ఆనందం చూడటమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. కార్యక్రమంలో నాయకులు బొమ్మల యాదగిరి, చిన్నకోడూరు ఎఎంసీ ఛైర్మన్ మీసం మహేందర్, వైస్ ఛైర్మన్ బస్సా రాజశేఖర్, డైరెక్టర్లు, బాలరాజు, సింగబోయిన రాజు, ఎర్ర మహేందర్, దేశెట్టి నరేశ్, ప్రవీణ్ ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: