ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

  • •కొనుగోలు కేంద్రాలలో రైతులకు మౌలిక వసతులు కల్పించాలి

విశ్వంభర, కోదాడ : జిల్లాలో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. మంగళవారం పట్టణ పరిధిలోని తమ్మర బండపాలెంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందన్న అంచనా మేరకు జిల్లా వ్యాప్తంగా 340కి పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 25వేల మెట్రిక్ టన్నుల పైగా ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, సోమవారం ఒక్కరోజే 8900 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు వివరించారు. గతంలో ర…

Tags: