జంగంగుట్ట డంపింగ్ యార్డ్‌లో ప్లాస్టిక్ దహనం… ప్రజల ఆరోగ్యానికి ముప్పు
విశ్వంభర,చేవెళ్ల: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని జంగంగుట్ట డంపింగ్ యార్డ్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చడం వల్ల పరిసర ప్రాంతాల్లో తీవ్ర కాలుష్యం వ్యాపిస్తోంది. ప్లాస్టిక్ దహనం సమయంలో విడుదలయ్యే విషవాయువులు గాలిలో కలసి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డంపింగ్ యార్డ్‌లో చెలరేగుతున్న మంటలు కొన్నిసార్లు అదుపుతప్పి సమీప వ్యవసాయ పొలాలకు వ్యాపిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. దీనివల్ల పంటలు దెబ్బతినడంతో పాటు ఆర్థిక నష్టాలు వాటిల్లుతున్నాయని వారు చెబుతున్నారు.భారతీయ జనతా పార్టీ జిల్లా యువనాయకుడు డాక్టర్ వైభవ్ రెడ్డి స్పందిస్తూ, ప్లాస్టిక్ వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. డంపింగ్ యార్డ్‌లో అగ్ని ప్రమాదాలు నివారించేందుకు పర్యవేక్షణ బలోపేతం చేయడం, భద్రతా సిబ్బందిని నియమించడం, ప్రత్యామ్నాయ వ్యర్థ నిర్వహణ విధానాలను అమలు చేయాలని సూచించారు.



