అక్టోబర్ 15 ఉచిత మెగా వైద్య శిబిరం.  - మేనేజింగ్ డైరెక్టర్ మాస ప్రశాంతి కృష్ణ

అక్టోబర్ 15 ఉచిత మెగా వైద్య శిబిరం.  - మేనేజింగ్ డైరెక్టర్ మాస ప్రశాంతి కృష్ణ

విశ్వంభర, చండూర్ : సాయి సంజీవిని హాస్పిటల్ చండూరు వారి ఆధ్వర్యంలో సంకల్ప సూపర్ స్పెషాలిటీ  హాస్పిటల్ సహకారంతో సంయుక్తంగా  ఉచిత మెగా వైద్య శిభిరం అక్టోబర్ 15 వ తేది బుధవారం నాడు  సాయి సంజీవిని హాస్పిటల్ వద్ద నిర్వహిస్తున్నామని మేనేజింగ్ డైరెక్టర్ మాస ప్రశాంతి కృష్ణ ఓ మీడియా ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా డాక్టర్లు శివాని , శ్రీనివాస్ లు మాట్లాడుతూ పుట్టిపెరిగిన ఊరి కోసం ఏదో ఒక విధంగా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో సొంత ఊరిలోనే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని, లాభాపేక్ష లేకుండా వైద్య సేవలు అందిస్తున్నామని వారు తెలిపారు. అలాగే ఉచిత వైద్య మెగా శిబిరాలను ఏర్పాటు చేసి  నిరుపేద ప్రజలకు వైద్య సేవ చేయడం జరుగుతుందని అన్నారు. అనుభవజ్ఞులు అయిన డాక్టర్లు చే  ఈ వైద్య శిబిరం నందు అందించే  ఉచిత సేవలు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఉచితంగా ఫీజు లేకుండా చూడడం,  షుగర్ పరీక్ష ,బిపి, ఈసీజీ ,  డైట్ చార్ట్, మహిళల ఆరోగ్య సమస్యలకు అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా చూడడం జరుగుతుందని అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సర్జరీలు కూడా చేస్తున్నామని తెలిపారు.  సంకల్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో వివిధ రకాల డాక్టర్లు తో కలిసి అక్టోబర్ 15 న  సాయి సంజీవని హాస్పిటల్ వద్ద పెద్ద ఎత్తున ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. 
 
 

Tags: