ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు
విశ్వంభర , పరిగి: దోమ మండల పరిధిలోని గొట్ల చేల్క తండా గ్రామంలో ఇందిరమ్మ ఇల్లును ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దోమ మండల పిఎసిహెచ్ చైర్మన్ యాదవ రెడ్డి, సర్పంచ్ కవిత చందర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ ఇండ్లు నిర్మించిన దాఖలాలు లేవన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శాంతు కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాఘవేందర్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.