రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసిన బీఆర్ఎస్ నేతలు

  • ఎస్‌ఐఆర్ ప్రక్రియలో లోపాలపై వినతిపత్రం సమర్పణ

విశ్వంభర, హైదరాబాద్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, సోమా భరత్, కర్నె ప్రభాకర్, వై. సతీష్ రెడ్డి, సుమిత్రానంద్ తదితరులు ఈ బృందంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు పార్టీ తరఫున ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, బీఎల్‌వోలు, బీఎల్‌ఏలతో సమన్వయం చేసేందుకు నియమించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బీఎల్‌వోలు సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని, అనేక ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ ఫారాలు ఓటర్లకు అందడం లేదని ఆరోపించారు. ప్రక్రియ పూర్తి చేసేందుకు కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉండటంతో గడువును పొడిగించాలని ప్రధాన ఎన్నికల అధికారిని కోరినట్లు తెలిపారు. ఈ అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని సీఈఓ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అలాగే డూప్లికేట్ ఓట్ల తొలగింపు, ఓటర్ల పేర్లలో ఉన్న గందరగోళాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, బీఎల్‌వోలకు తగిన సూచనలు జారీ చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని వినతిపత్రంలో కోరినట్లు వినోద్ కుమార్ వెల్లడించారు.

🕒 07 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/brs-leaders-met-the-chief-electoral-officer-of-the-state/article-18091

Tags: