సర్పంచ్ గా మన్నే పాండు నామినేషన్
On
విశ్వంభర, మర్పల్లి :- తుమ్మలపల్లి గ్రామ కాంగ్రెస్ అభ్యర్థి మన్నె పాండు సర్పంచ్ గా నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా పాలన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయబావుటా ఎగరవేస్తారని అన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ గా పోటీలో ఉండడం చాల సంతోషముగా ఉందని అన్నారు. సర్పంచ్ గా భారీ మెజారిటీ తో గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తానని అన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను అధికార పార్టీ ద్వారా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు అయ్యేలా కృషి చేసి, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



