మున్సిపల్ చైర్ పర్సన్ పున్న శైలజకు ఘనంగా సన్మానం
విశ్వంభర, చౌటుప్పల్ /దండు మల్కాపురం :- దేవరకొండ మున్సిపల్ చైర్మన్ గా విజయం సాధించిన పున్న శైలజకి తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. తెలంగాణ చేనేత ఐక్య వేదిక సర్వ సభ్య సమావేశమును పురస్కరించుకొని దండు మల్కాపురం ఆందోల్ మైసమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆమెకు రాష్ట్ర చేనేత ఐక్య వేదిక కమిటీ అధ్యక్షులు రాపోలు వీరమోహన్ వివిధ జిల్లాల ప్రతినిధుల సమక్షములో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పద్మశాలీలు అన్ని రంగాల్లో ముందుండాలని , ఆర్ధిక , రాజకీయ, సామాజిక చైతన్యం కోసం ప్రతిఒక్కరు కృషి చేసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అలాగే చేనేత రంగం వృద్ధి చెందేలా , తనవంతు భాద్యత గా చేనేతకు , చేనేత కార్మికుల పక్షాన పోరాటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రంలో ఐక్యవేదిక మహిళా విభాగం , గ్రేటర్ హైదరాబాద్ చేనేత యువజన విభాగం తదితరులు పాల్గొన్నారు