బోధక ఆయాల మెరిట్ లిస్ట్ పై అభ్యంతరాల స్వీకరణ
- ఎంఈవో రాందాస్
విశ్వంభర, నెల్లికుదురు: పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు మంజూరైన బోధకులు(ఇన్స్ ట్రక్టర్స్)ఆయాల నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితా పై అభ్యంతరాలనుసోమవారం సా.5గం.ల వరకు తగిన ఆధారాలతో రాతపూర్వకంగా తనకు సమర్పించాలని ఎంఈఓ రాందాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రీ ప్రైమరీ బోధక ఆయా పోస్టులు మండలంలోని పార్వతమ్మ గూడెం రావిరాల పాఠశాలలకు మంజూరైనట్లు ఎంఈఓ పేర్కొన్నారు. సంబంధిత పోస్టుల నియామకం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల తాత్కాలిక మెరిట్ జాబితా మండల విద్యాశాఖ కార్యాలయం లో ప్రదర్శించినట్లు తెలిపారు. మెరిట్ జాబితాపై అభ్యంతరాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లా సెలక్షన్ కమిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితా డీఈవో విడుదల చేస్తారని ఆయన తెలిపారు.