ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య విజయం: కాంగ్రెస్ పార్టీ నాయకులు
విశ్వంభర, పరిగి: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం విద్యార్థుల పోరాటానికి దక్కిన విజయమని, ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలిచిందని పరిగి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిందన్నారు. వరుసగా పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడే ప్రభుత్వాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.గత 25 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందని తెలిపారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు మద్దతు తెలుపుతూ వారి పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని, కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ముందు నిరసన చేపట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారని పేర్కొన్నారు. విద్యార్థుల ఐక్య పోరాటం, దేశవ్యాప్తంగా ప్రజల మద్దతు, కాంగ్రెస్ పార్టీ నిరంతర ఉద్యమం ఫలితంగా నే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఒక వ్యక్తి రాజీనామా మాత్రమే కాదువిద్యార్థుల స్వరం గెలిచిందని, ప్రజాస్వామ్యం నిలిచింద నే దానికి నిదర్శనం అని పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా విద్యార్థులు, నిరుద్యోగుల హక్కులను కాలరాసే ప్రయత్నం జరిగితే కాంగ్రెస్ పార్టీ మరింత తీవ్రంగా పోరాడుతుందని హెచ్చరించారు. విద్యార్థులు, యువత, నిరుద్యోగుల హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రజిత వెంకటేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ రాములు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, పరిగి మండల పిఎసిఎస్ వైస్ చైర్మన్ బద్రి గారి రాజ పుల్లారెడ్డి, కౌన్సిలర్లు బాదం అఖిల శ్రీనివాస్ గుప్తా, జాఫర్ పల్లి సర్పంచ్ మహేష్, కాంగ్రెస్ నాయకులు రాధాకృష్ణారెడ్డి, నాగవర్ధన్, రవికాంత్ రెడ్డి, జగన్ గుప్తా, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.