వాగ్దేవిలో నేషనల్ ఫార్మసి వీక్-2025 సెలబ్రేషన్స్
విశ్వంభర, హనుమకొండ :- నగరంలోని ప్రముఖ వాగ్దేవి విద్యాసంస్థల వాగ్దేవి కాలేజీ ఫార్మసీ రాంనగర్ హనుమకొండ వారు 64వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలు- 2025 సందర్భంగా బీఫార్మసీ ఫార్మా. డి విద్యార్థినీ విద్యార్థులకు గత వారం రోజులుగా ఎన్నో ఆవశ్యకమైన అద్భుతమైన ఫార్మసీ విద్యా, సాహితీ మరియు సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించినారు ఈ ఫార్మసీ వారోత్సవాలు ది.వి .22 /11/ 2025 శనివారం నాడు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే .శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ప్రొఫెసర్ డాక్టర్ జి.సమ్మయ్య డీన్, ఫ్యాకల్టీ ఆఫ్ ఫార్మసీ, కాకతీయ యూనివర్సిటీ, వరంగల్ వారు ముఖ్యఅతిథిగా మరియు ప్రొఫెసర్ వై. నరసింహారెడ్డి, సీనియర్ ప్రొఫెసర్ ఫార్మసీ, యు సి పి ఎస్ సి, కాకతీయ యూనివర్సిటీ వారు విశిష్ట అతిథిగా మరియు హెచ్.ఓ.డీలు డాక్టర్ బి.ఎస్. శరవణ భవ, డాక్టర్ ఈ.వెంకటేశ్వర్లు, డాక్టర్ సి.హెచ్.మహేష్, డాక్టర్ వై. శ్రవణ్ కుమార్, డాక్టర్ స్వర్ణలత గారలు ముగింపు వారోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించినారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్ జీ సమ్మయ్య డీన్ యు సి పి ఎస్ సి కాకతీయ యూనివర్సిటీ వరంగల్ వారు ఈ సెలబ్రేషన్స్ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చిత్త శుద్ధి ,కరుణ కర్తవ్యంతో పేషంట్ కౌన్సిలింగ్ తీసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం సేఫ్టీ మెడికేషన్ ఔషధ జ్ఞానంతో కూడిన సేవలను అందించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఫార్మసిస్ట్ థీమ్ :ఫార్మసిస్ట్ అడ్వకేట్ ఆఫ్ వ్యాక్సినేషన్ అంశం పైన తన ఉపన్యాసంతో రోగికి కౌన్సిలింగ్' టీకాలు వేయమని ,టీకాలపై సంపూర్ణ అవగాహన కల్పించడం టీకాలను వేసుకోవడం వలన వచ్చే ఉపయోగాలను తెలపడం, వేసుకోకపోతే వచ్చే దుష్పరిణామాలను, రైట్ టైం, రైట్ పర్సన్,రైట్ వ్యాక్సిన్ ,ఏ వ్యాక్సిన్ ఏ వయసులో వేసుకోవాలి అనే విషయం, వ్యాక్సిన్ అవేర్నెస్ను సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం ప్రజలలో వ్యాక్సిన్ పట్ల ఉన్న భయాన్ని తొలగించడం, వ్యాక్సిన్ తీసుకునే విధానంలో ఫార్మసిస్ట్ యొక్క పాత్ర గురించి వివరంగా తెలిపారు. వాక్సినేషన్ సంఖ్యను పెంచడంలో,మరియు ఇన్ఫెక్షయూస్ రోగములను నివారించడంలో ముఖ్యపాత్ర వహించాలి అని విద్యార్థులను ఉద్దేశించి తెలిపారు.ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ప్రతి విద్యార్థి విద్యార్థినీలు సైంటిఫిక్ విధానాన్ని అలవర్చుకొని కొత్త మందులు కనుగొనడంలో నిమగ్నం కావాలని, ఫార్మసిస్టు మందులపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఫార్మసీ విద్యార్థులు సైంటిఫిక్ విధానాన్ని అలవరచుకొని కొత్త మందులను కనుగొనడంలో నిమగ్నం కావాలని ఫార్మసిస్ట్ మందులపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. విశిష్ట అతిథి ప్రొఫెసర్ వై. నరసింహారెడ్డి గారు విద్యార్థులను ఉద్దేశించి ఫార్మసిస్టులు వ్యాక్సిన్స్ పట్ల అవగాహన మరియు ప్రజలకు వాటిపైన అపోహలను తొలగిస్తూ బాధ్యతాయుతంగా పేషంట్లను వ్యాక్సిన్ షెడ్యూల్ గైడ్ చేస్తూ, పబ్లిక్ ను సపోర్ట్ చేస్తూ, హెల్త్ కేర్ ప్రొవైడర్స్ తోటి కలిసికట్టుగా పనిచేస్తూ కర్తవ్యబద్దులై ఉండాలని కోరారు. ఈ ఫార్మసీ వారోత్సవాలు ఇంత ప్రతిష్టాత్మకంగా ఘనంగా నిర్వహించినందుకు కళాశాల సెక్రటరీ కం కరస్పాండెంట్ డాక్టర్ సి.హెచ్ దేవేందర్ రెడ్డి మరియు వైస్ ప్రెసిడెంట వాహిని దేవి ప్రిన్సిపాల్ డాక్టర్ కే శ్రీనివాస్ రెడ్డి గారు నిర్వాహకులను అభినందించారు



