నాంపల్లి లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ టెస్ట్
On
యూత్ ఫర్ సేవా సహకారం తో నవ నిర్మాణ్ హెల్పింగ్ సోసైటీ
విశ్వంభర, నాంపల్లి : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ టెస్ట్ కి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నాంపల్లి మండల కేంద్రం లోని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి చేతుల మీదుగా 8వ తరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ , ప్రీవియస్ పేపర్స్ ను అందచేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. NMMS 2023-24 సెలెక్ట్ అయిన విద్యార్థులకు కర్నాటి శ్రీహరి బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమం లో స్వామి వివేకానంద ఉత్సవ సమితి అధ్యక్షులు, సామజిక సేవా కార్యకర్త కర్నాటి శ్రీహరి, ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు జ్యోతి, నరేష్, వాలంటీర్స్ అరెగంటి జగన్, నాంపల్లి కేతన్, ఆశ్వేజ్, లక్ష్మీ నారాయణ, విద్యార్థులు,పాల్గొన్నారు.