చమురు ధరల పెరుగుదలపై ఆందోళన: నారాయణ
విశ్వంభర, హైదరాబాదు : పెట్రోల్, డీజిల్ ధరలు వేగంగా పెరుగుతూ ప్రజలపై భారాన్ని మోపుతున్నాయని సిపిఐ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కె. నారాయణ అన్నారు. హైదరాబాదు లో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ధరలను కారణంగా చూపుతూ తక్కువ సమయంలోనే లీటరుకు భారీగా పెంపు చేయడం సమంజసం కాదని విమర్శించారు. కేంద్రం పన్నులు, రాష్ట్రాల స్థానిక శుల్కాల కారణంగా చమురు ధరలు అధికంగా ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చమురు ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఆర్థిక భారం ఎక్కువవుతోందన్నారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి చమురు ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.