ఉప్పుల సురేష్ బాబును పరామర్శించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
విశ్వంభర, జనగామ: దేవరుప్పుల మండలం, సీతారాంపురం గ్రామానికి చెందిన జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఉప్పుల సురేష్ బాబు అయ్యగారికి ఇటీవల కంటి శస్త్రచికిత్స జరగడంతో పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ఈరోజు వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఉప్పుల సురేష్ బాబు ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకొని,వైద్యులు సూచించిన విధంగా పూర్తి విశ్రాంతి తీసుకోవాలని,మందులు క్రమం తప్పకుండా వాడాలని,త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని,ఉప్పుల సురేష్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎన్నో సంవత్సరాలుగా చేసిన సేవలను ఎమ్మెల్యే కొనియాడుతూ,పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పరామర్శకు ఉప్పుల సురేష్ బాబు కృతజ్ఞతలు తెలియజేస్తూ త్వరలోనే పూర్తిగా కోలుకుని ప్రజా,పార్టీ కార్యక్రమాల్లో తిరిగి పాల్గొంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు కాసారపు ధర్మారెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దావేర అనిల్ కుమార్,యూత్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న,నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు ఉప్పుల ప్రకాష్,బిసి సెల్ అధ్యక్షుడు కాడబోయిన గణేష్,మండల నాయకులు,యువజన నాయకులు,ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.