గోదాం శంకుస్థాపన లో పాల్గొన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
On
విశ్వంభర, చండూరు :- రైతు సేవా సహకార సంఘం ఆవరణలో 38.56 లక్షలతో నిర్మించ తలపెట్టిన గోదాంను ముఖ్య అతిధులు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి , DCCB నల్గొండ ఛైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది .ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ గోదాము ఏర్పాటు చేయడం వలన రైతులకు ఎల్లవేళలా ఎరువులను అందుబాటులో ఉంచవచ్చును అని ,అదేవిధంగా చండూరు రైతు సేవా సహకార సంఘాన్ని నష్టాల బారి నుండి లాభాల బాటలో నిలిపిన రైతు సేవ సహకార సంఘం ఛైర్మన్ కోడి సుష్మ వెంకన్నను మరియు పాలకవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో రైతు సేవ సహకార సంఘం డైరెక్టర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోలు వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు కొలిమి ఓంకారం, అనంత్ చంద్ర శేఖర్ ,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గోటి సుజాత వెంకటేశ్ యాదవ్ ,మస్థానిక నాయకులు, మున్సిపల్ కమిషనర్ మల్లేశం , పన్నాల లింగయ్య, అబ్బనబోఇన లింగం యాదవ్ , పల్లే వెంకన్న ,లక్ష్మణ్ ,కావలి ఆంజనేయులు, బూదరాజు ఆంజనేయులు ,సంజయ్ ,ధశరథ, పాల రాములు తదితరులు పాల్గొన్నారు.



