ఏపీ సీఎం చంద్రబాబు ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యేలు గాంధీ, ప్రకాష్ గౌడ్.

WhatsApp Image 2024-07-08 at 5.54.00 PM

విశ్వంభర కూకట్ పల్లి జూలై 8 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా  సోమవారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ తిరుమల దైవదర్శనానికి వచ్చే భక్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధులు తీసుకువచ్చే సిఫార్స్ లేఖలను పరిగణలోకి తీసుకొని, ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందిస్తూ చంద్రబాబు నాయుడు లెటర్లను స్వీకరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read More హైదరాబాద్‌ వేదికగా మరో అంతర్జాతీయ క్రీడా సంబరం