గొర్రెలకు మిశ్రమ దాణా  అందించాలి

గొర్రెలకు మిశ్రమ దాణా  అందించాలి


  • : పశువైద్యాధికారి డా.రవీందర్

విశ్వంభర, ఇనుగుర్తి: గొర్రెలు, మేకల ఎదుగుదల కోసం మిశ్రమ దాణా ను అందించాలని పశు వైద్యాధికారి డా.ఎం.రవీందర్ శుక్రవారం ఒక ప్రకటనలో గొర్రెలు, మేకల పెంపకం దారులకు సూచించారు. సరైన మేత లభించని సమయంలో దాణా ఎంతో ఉపయోగ కరంగా ఉంటుందన్నారు. జీవాలకు మనం వేసే మేతలో అన్ని రకాల పోషక విలువలు అందకపోవడంతో గొర్రెలు, మేకలు అనారోగ్యానికి గురై సరైన ఎదుగుదల లోపిస్తుందని పేర్కొన్నారు. వీటిని అధిగమించి ఆరోగ్యకరమైన, బలిష్టమైన జీవాల కోసం దాణా  మనమే తయారు చేసుకోవచ్చని చెప్పారు. మొక్కజొన్న, లేని పక్షంలో జొన్న, బియ్యపు నూకలు, తౌడు, ఉప్పు మిశ్రమాలతో ఇంటి వద్దనే తయారు చేసుకోవాలని సూచించారు. దీనిని గొర్రెలు మేక పిల్లలతో పాటు, జీవాలకు తగుపాళ్ళలో అందించినట్లయితే పౌష్టికాహారం పొంది వ్యాధి నిరోధక శక్తి పెరిగి, ఎన్నో రకాల వ్యాధులు సోకకుండా మంచి ఆరోగ్యంతో ఎదుగుతాయని తెలిపారు. దీంతో పెంపకం దారులకు లాభదాయకంగా ఉంటుందన్నారు.

Tags: