విచ్ఛిన్నకర రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం

విచ్ఛిన్నకర రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం

విశ్వంభర,  చింతపల్లి : చింతపల్లి మండల వ్యాప్తంగా బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఊరూ వాడా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.. మండలంలోని బంగ్లా వద్ద పార్టీ ఆవిర్భావ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సమ్మిడి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఎగురవేసి నాయకులు, కార్యకర్తలకు స్వీట్‌లు పంచిపెట్టారు. నేటి నుంచి గ్రామ పంచాయతీల్లో బీజేపీ ఆధ్వర్యంలో ‘మన ఊరు.. మన జెండా’ పేరుతో కార్యక్రమం ప్రారంభం కానుందన్నారు. దేశంలో విచ్ఛిన్నకర రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేసిందని సమ్మిడి ప్రకాష్ రెడ్డి తెలిపారు. అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా బీజేపీ అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టిందన్నారు. పొత్తులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితి నుంచి సంపూర్ణ మద్దతుగా ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు బీజేపీ బలపడిందని చెప్పుకొచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక శత్రు దేశాలు దాడి చేసేందుకు కూడా వెనకడుగు వేశాయన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కుల, మత ఘర్షణలు లేవని తెలిపారు. ‘సబ్ కా సాత్.. సబ్‌ కా వికాస్’ నినాదంతో బీజేపీ అడుగులు వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ బీజేపీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి లాలునాయక్, బీజేపీ మండల అధ్యక్షులు సముద్రాల నగేష్, జిల్లా నాయకులు చెనమోని రాములు, శివర్ల రమేష్, దావా శ్రీనివాస్, కుకుడపు రామకృష్ణ, వెన్నం శేఖర్, కుంభం శ్రీనివాస్ రెడ్డి, ఎండి జహంగీర్, ధరణిపతి రమణారావు, మోర వెంకటరమణ, జక్కుల రమేష్, ఎర్ర వెంకయ్య, బొడ్డు మహేష్, సోమరాజు ప్రదీప్, బూత్ అధ్యక్షులు పాలకుర్ల రాజు, మొగిలమోని మల్లేష్, గజ్జె అభినవ్, మర్ల వెంకయ్య, యుగేందర్ నాయక్, గుండ్లపల్లి లక్ష్మణ్, మొగిలమోని రవి, కడారి కృష్ణ, బాల్ జంగయ్య, మరియు బీజేపీ వివిధ శాఖల నాయకులు పాల్గొన్నారు.

Tags: